హైదరాబాద్: 28°C
తెలంగాణ

గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రత్యేక అధికారులు

BHPL: గోదావరి పుష్కరాల నిర్వహణకు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. శుక్రవారం పుష్కరాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అధిక రద్దీ ఉండే టైర్-1 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికతతో కమాండ్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా అదనపు ఏర్పాట్లపై ఘాట్ల వారీగా కలెక్టర్లతో సర్వే చేయించామని తెలిపారు.