హైదరాబాద్: 28°C
తెలంగాణ

కెమిస్ట్రీ లెక్చరర్ లేక విద్యార్థుల అవస్థలు..!

WGL: ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమిస్ట్రీ సబ్జెక్టుకు బోధన అందక విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతోందని తెలిపారు. విద్యా సంవత్సరం కొనసాగుతున్న నేపథ్యంలో ఖాళీని వెంటనే భర్తీ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.