హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబరులో ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన..!

WGL: వరంగల్‌ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకు సంబంధించి అధికారులు చర్యలు వేగవంతం చేశారు. 958 ఎకరాల ప్రాంగణంలో మూడు ప్యాకేజీలుగా పనులు చేపట్టేందుకు ఏఏఐ ప్రణాళిక రూపొందించింది. నవంబర్ నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, డిసెంబరులో శంకుస్థాపన చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.