SRCL: బోయినపల్లి మండలం మాన్వాడ మిడ్ మానేరు జలాశయంలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు 24 గంటల సగటు ప్రకారం 2,219 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. జలాశయ నీటిమట్టం 315.93 మీటర్లు, నీటి నిల్వ 22.485 టీఎంసీలుగా నమోదైంది. 170 క్యూసెక్కుల నీటిని ఆవిరి, మానేరు బ్యాలెన్స్ అవసరాలకు విడుదల చేస్తున్నారు.
తెలంగాణ
మిడ్ మానేరు జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం


