KMM: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని పార్కులను శనివారం హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక ఆకస్మికంగా సందర్శించి మెయింటెనెన్స్ పనులను తనిఖీ చేశారు. పార్కులలో పచ్చదనం పెంపొందించడం, ఓపెన్ జిమ్‌ల నిర్వహణ, మొక్కల సంరక్షణపై అధికారులతో సమీక్షించారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పార్కులను తనిఖీ చేసిన హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక


