KMR: దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ వృద్ధాశ్రమం నుంచి ఓ వృద్ధరాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉ. 8 గంటల సమయంలో ఆశ్రమం నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో పోలీసులు గాలింపు చేపట్టారు. అదృశ్యమైన మహిళకు సంబంధించిన ఫొటో, ఇతర వివరాలను పోలీసులు విడుదల చేశారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
తెలంగాణ
దేవునిపల్లిలో వృద్ధరాలు అదృశ్యం!


