SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేపట్టారు. గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పోషణ, నిత్యావసర ఖర్చులకు డబ్బులు లేక అవస్థలు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించి తమను ఆదుకోవాలని కోరారు.
తెలంగాణ
జిన్నారం పారిశుద్ధ్య కార్మికుల భిక్షాటన


