హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగులో లారీ క్లీనర్ అదృశ్యం

MLG: భూపాలపల్లి జిల్లా పెద్దాపూర్‌కు చెందిన లారీ క్లీనర్ సమ్మెట నరేష్ అదృశ్యమయ్యారు. ఈనెల 16న ములుగు బండారుపల్లి సమీపంలో డ్రైవర్‌తో కలిసి భోజనం చేసిన అనంతరం లారీ క్యాబిన్‌లోని రూ.20 వేల నగదుతో వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.