హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

MLG: ములుగు కేంద్రంలోని ప్రగతి కాలనీకి చెందిన మేకల సమ్మయ్య(60) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. బట్టలు శుభ్రం చేసుకోవడానికి గురువారం పట్టణ శివారులోని తోపుకుంట వద్దకు వెళ్లిన సమ్మయ్య కరకట్ట వద్ద పడిపోయి ఉన్నారు. స్థానికులు గమనించి వరంగల్ ఎంజీఎంకు తరలించగా శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.