హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచి ఆసియా క్రీడలు

20వ ఆసియా క్రీడలు ఇవాళ్టి నుంచి జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా సంబురం అక్టోబర్ 4 వరకు జరగనుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. అయితే, కొన్ని క్రీడల ప్రాథమిక రౌండ్లు సెప్టెంబర్ 14 నుంచే ప్రారంభమయ్యాయి. భారత్ తరఫున వివిధ క్రీడల్లో పతకాల కోసం మొత్తం 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.