హైదరాబాద్: 28°C
తెలంగాణ

పినపాక క్రీడల్లో జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థుల హవా

BDK: పినపాక మండలంలో జరిగిన మండల స్థాయి క్రీడా పోటీల్లో జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు సత్తా చాటారు. అండర్‌-17 కబడ్డీ, ఖో-ఖో, అండర్‌-14 ఖో-ఖోలో విజేతలుగా నిలిచారు. అండర్‌-17, అండర్‌-14 వాలీబాల్‌లో రన్నరప్‌గా నిలిచారు. అండర్‌-17 లాంగ్‌జంప్‌లో టీ.హరిచరణ్‌ విజేతగా, అండర్‌-14లో బి.సిద్ధు రెండో స్థానంలో నిలిచారు. శనివారం బాలికల పోటీలు జరగనున్నాయి.