హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఏడుపాయల వనదుర్గకు ప్రత్యేక పూజలు

MDK: శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ క్షేత్రం నేడు భక్తజనసందోహంగా మారింది. ఇవాళ పర్వదినాన్ని పురస్కరించుకుని మంజీరా నదీపాయల మధ్య కొలువైన అమ్మవారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. ప్రత్యేకాలంకారంలో అలరించిన శ్రీమాతను దర్శించుకుని భక్తులు తరించారు. తెల్లవారుజాము నుంచే సుప్రభాత సేవ, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఆలయ ప్రాంగణం భవాని నామస్మరణతో మారుమోగింది.