హైదరాబాద్: 28°C
తెలంగాణ

కూరగాయలు తెస్తానని వెళ్లి వ్యక్తి అదృశ్యం

SRD : కూరగాయలు తీసుకొస్తానని గదిలో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన ఘటన పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రామ్‌ సరన్ (35) పటాన్‌చెరు సమీపంలోని ప్రైవేట్‌ పరిశ్రమలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న కూరగాయలు తెస్తానని బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.