WGL: భద్రకాళి అమ్మవారి ఆలయంలో శనివారం అర్చకులు ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వరంగల్తోపాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు


