హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇస్లాం‌పూర్‌లో వ్యక్తి దారుణ హత్య

MDK: తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ గ్రామంలో కొండాపురం శ్రీరాములు (50) శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. కొంతకాలంగా భార్యతో కుటుంబ కలహాలు కొనసాగుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. రాత్రి గొడవలు జరిగి హత్య చేసినట్లు వివరించారు. అనంతరం కుటుంబీకులు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.