హైదరాబాద్: 28°C
తెలంగాణ

KGBVలో శిక్షణకు అధ్యాపకుల దరఖాస్తుల ఆహ్వానం

BHNG: భువనగిరి పట్టణంలోని కేజీబీవీలో ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, CLAT (క్లాట్)లో శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఎంపికైన వారికి గంటకు రూ.650 గౌరవ వేతనం చెల్లిస్తారు. ఈ నెల 22లోగా డీఈఓ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.