హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ

BHPL: ప్రజల భాగస్వామ్యంతోనే నేరాలను నియంత్రించవచ్చని డీఎస్పీ సంపత్ రావు అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా మొట్లపల్లి మండల కేంద్రంలోని పంచాయతీలో ఏర్పాటు చేసిన 15 సీసీ కెమెరాలను శుక్రవారం చిట్యాల సీఐ సతీష్‌తో కలిసి ప్రారంభించారు. ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటులో భాగస్వాములైన వారిని డీఎస్పీ అభినందించారు.