హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

MDK: నిజాంపేట పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో నాలం రాజాగౌడ్ తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్తున్న కారు.. రహదారి దాటుతున్న ఆయనను ఢీకొట్టడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని స్థానికులు హుటాహుటిన ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.