హైదరాబాద్: 28°C
తెలంగాణ

'చలో యాదగిరిగుట్ట సభను విజయవంతం చేయాలి'

BHPL: ఈ నెల 27న తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న యాదగిరిగుట్ట సభను విజయవంతం చేయాలని మండల ఫోరం అధ్యక్షుడు జన్నె యుగంధర్ కోరారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యమకారుల సంక్షేమం, హక్కుల కోసం ఫోరం తొమ్మిదేళ్లుగా పోరాడుతోందని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.