హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ఆక్రమణపై కాలనీవాసుల ధర్నా

JN: జఫర్‌గఢ్ మండల కేంద్రంలో ఒకటో వార్డు కుమ్మరివాడలో రోడ్డును ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాలనీవాసులు శుక్రవారం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పురుగుల మందు సీసాలతో ఆందోళనకు దిగారు. స్థలాన్ని పరిశీలించి న్యాయం చేస్తామని పంచాయతీ కార్యదర్శి దినేశ్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.