JN: మతిస్థిమితం సరిగా లేని గుగులోత్ ప్రేమ్‌కుమార్ (26) కోలుకొండ గుట్టల్లో మృతి చెందాడు. పాలకుర్తి మండలం బీక్యానాయక్‌తండాకు చెందిన ప్రేమ్‌కుమార్ మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం గుట్టల్లో మృతదేహాన్ని గుర్తించారు. సంఘటనా స్థలంలో మందులు, నీళ్ల సీసా లభించడంతో ఆత్మహత్యగా భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
మతిస్థిమితం లేని యువకుడి మృతి


