KNR: కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ఆసుపత్రి సమీపంలో పేకాట స్థావరంపై శుక్రవారం రూరల్ పోలీసులు దాడి చేశారు. సీఐ నిరంజన్ రెడ్డి నేతృత్వంలో ఆరుగురిని అదుపులోకి తీసుకొని రూ.12 వేల నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించనున్నట్లు తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


