MBNR: అమ్రాబాద్ మండలలోని ZP బాలికల పాఠశాలలో 50 ఏళ్ల కిందట నిర్మించిన తరగతి గదులు పాడయ్యాయి. వాటిని కూల్చకపోవడంతో పిచ్చిమొక్కలతో పాటు, విషపురుగులు తిరుగుతుండడంతో విద్యార్థులు ఆ వైపు వెళ్లేందుకు భయపడుతున్నారు. నిరుపయోగంగా ఉన్న గదులు తొలగిస్తే విద్యార్థులకు ఆటస్థలం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఉపాధ్యా యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
భవనం కూల్చి.. ఆటస్థలం చేయండి!


