ADB: ఉమ్మడి జిల్లాలోని గిరిజన యువత ఉపాధి కోసం 3నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ITDA ఇన్ఛార్జ్ పీవో రాజేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ, బెల్లంపల్లి YTC కేంద్రాలలో కంప్యూటర్, ఎలక్ట్రిషియన్, కిచెన్ హెల్పేర్, బ్యూటీషియన్ కోర్సులలో శిక్షణ ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 30లోపు ఉట్నూర్ ITDA కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
గిరిజన యువతకు ఉచిత శిక్షణ: ITDA PO రాజేశ్వర్


