హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసం

MDCL: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబరాబాద్‌లో రూ.72.94 లక్షల మోసం వెలుగు చూసింది. బాచుపల్లికి చెందిన వ్యాపారిని వాట్సాప్ ద్వారా సంప్రదించిన కేటుగాళ్లు, అధిక లాభాల ఆశచూపి రూ.2.19 కోట్లు పెట్టుబడి పెట్టించారు. కొంత మొత్తం తిరిగి జమ అయినట్లు చూపించి, మిగతా రూ.72.94 లక్షలు ఇవ్వకుండా మోసగించారు. బాధితుడి ఫిర్యాదుతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.