హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్ప శిల్పకళ అద్భుతం

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప శిల్పకళా సంపద అద్భుతంగా ఉందని టర్కీ ప్రతినిధుల బృందం కొనియాడింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డితో కలిసి శుక్రవారం రామప్పను సందర్శించిన వారు రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ చరిత్ర,శిల్పకళా విశిష్టతలను తెలుసుకున్నారు.శిల్పాల అందాలను కెమెరాల్లో బంధించారు.