ASF: కెరమెరి మండలం జానకపూర్‌లో తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగు మందు తాగి మృతి చెందాడు. జాదవ్ సాహిల్ మద్యం సేవిస్తూ పనికి వెళ్లడం లేదని తండ్రి మందలించాడు. దీంతో ఈ నెల 17న సాయంత్రం చేనుకి వెళ్లి పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
తండ్రి మందలించడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య


