హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలి: కలెక్టర్

జగిత్యాల జిల్లాలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ప్రత్యేక పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శుక్రవారం ఆవిష్కరించారు. స్వచ్ఛత, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలు, స్థానిక సంస్థలు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని పేర్కొన్నారు.