JN: జిల్లాలోని వక్ఫ్ భూములను పరిరక్షించాలని BRS మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మహమ్మద్ సలీం, మహమ్మద్ యాకూబ్ పాషా, గులాం జానీ, అజ్జు తదితరులు కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. అన్యాక్రాంతమైన భూములను గుర్తించి జాయింట్ సర్వే నిర్వహించాలని కోరారు. అక్రమ ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకుని భూములను వక్ఫ్ బోర్డు ఆధీనంలోకి తీసుకురావాలని కోరారు.
తెలంగాణ
వక్ఫ్ భూములను పరిరక్షించాలి: BRS


