హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేశుడికి ప్రత్యేక అలంకరణ

WGL: వరంగల్ శివనగర్‌లోని వినాయక ట్రస్ట్‌ భవన్‌లో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రూ.1.93 కోట్ల కరెన్సీ నోట్లతో మండపాన్ని అలంకరించి లక్ష్మీ పూజ నిర్వహించారు. గతేడాది రూ.1.51 కోట్లతో అలంకరించగా, ఈసారి రూ.42 లక్షలు అధికంగా నోట్లను ఉపయోగించారు. అలంకరణను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్వాహకులు భద్రతా చర్యలు చేపట్టారు.