హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంద పడకల ఆసుపత్రి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

SRPT: కోదాడ పట్టణంలో నూతనంగా నిర్మాణం జరుగుతున్న వంద పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిపై డాక్టర్ దశరథ్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో కల్పించాల్సిన వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై ఆరా తీశారు. నాణ్యత ప్రమాణాలతో పనులను త్వరగాతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.