హైదరాబాద్: 28°C
తెలంగాణ

79 మంది విద్యార్థులకు ఒకే టీచర్

GDWL: గట్టు మండలం బలిగేర ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో 79 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హలీమ్ పాషా పేర్కొన్నారు. పాఠశాలను సందర్శించి పరిశీలించగా, ఇద్దరు ఉపాధ్యాయులకుగాను ఒకరు లాంగ్ లీవ్‌లో ఉండటంతో బోధనకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని, వెంటనే అదనపు టీచర్‌ను నియమించాలని ఆయన కోరారు.