హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరెంటు సమస్యలపై అధికారులకు వినతి

GDWL: ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామ రైతులు తమ వ్యవసాయ పంటలకు విద్యుత్ సరఫరా సరిగా అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు విద్యుత్ ఎస్ఈని కలిసి వినతిపత్రం అందజేశారు. బావులు, బోర్లు వద్ద వరి పంట సాగు చేశామని తెలిపారు. ఇటీవల కాలంలో తరుచూ కరెంటు కోతలు విధించడంతో పైర్లకు నీరందక ఎండిపోయే పరిస్థితి వచ్చిందని వాపోయారు.