NRPT: జిల్లాలో గణేశ్ శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీతో పాటు యువకులు ఎస్పీని కలిశారు. ప్రజల ఆరోగ్యం, భద్రత దృశ్య డీజేలకు అనుమతించడం లేదని, ఇప్పటికే ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.
తెలంగాణ
గణేశ్ ఉత్సావాల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ


