హైదరాబాద్: 28°C
తెలంగాణ

తహసీల్దార్‌కు రైస్ మిల్లర్ల వినతిపత్రం

SDPT: తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ హుస్నాబాద్, అక్కన్నపేట రైస్ మిల్లర్లు శుక్రవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. గత పది రోజులుగా నిరసన సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. క్వింటాలు ధాన్యానికి 67 కిలోల బియ్యం నిబంధన (ఓటీఆర్)ను పునఃపరిశీలించాలని, వెంటనే టెస్ట్ మిల్లింగ్ నిర్వహించి న్యాయం చేయాలని మిల్లర్ల సంఘం నాయకులు కోరారు.