హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో భారీ జరిమానాలు

SDPT: సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన పలువురికి న్యాయమూర్తి కాంతారావు శిక్షలు విధించినట్లు ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి 1.20 లక్షల ఫైన్, లైసెన్స్ లేని 10 మందికి 50 వేల జరిమానాతో పాటు ఐదుగురికి జైలు శిక్ష పడిందన్నారు. ప్రమాదాల నివారణకు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.