హైదరాబాద్: 28°C
తెలంగాణ

పిల్లలను కొట్టారనే ఆరోపణలు.. టీచర్‌కు షోకాజ్ నోటీసులు

MHBD: కురవి మండలంలోని నేరడ కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలకు చెందిన టీచర్ సుహాసినికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు GCEO గాయత్రి శుక్రవారం తెలిపారు. పాఠశాలలో వినాయక చవితి పర్వదినోత్సవం సందర్భంగా పిల్లలను కొట్టారనే ఆరోపణ నేపథ్యంలో ఇంఛార్జ్ DEO ఆదేశాల మేరకు షోకాజ్ నోటీసులు అందించినట్లు ఆమె తెలిపారు. టీచర్ ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.