KMR: గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల శివారులో పత్తి పంటలో అంతర పంటగా అక్రమంగా సాగు చేస్తున్న 400 గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.12 లక్షలు ఉంటుందని డీఎస్పీ శ్రీనివాస్ రావు తెలిపారు. కౌలు భూముల్లో గంజాయి సాగు చేసిన మంజ సోనుసింగ్‌ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
తెలంగాణ
గంజాయి సాగు చేస్తున్న ముగ్గురు అరెస్ట్!


