హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఎన్నికల ఓటర్ల జాబితా సిద్ధం

కామారెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో ఉంచినట్లు అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి తెలిపారు. సభ్యులు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 24న నామినేషన్లు, 25న పరిశీలన, 26న ఉపసంహరణ జరగనుండగా, అక్టోబర్ 4న పోలింగ్ నిర్వహించేందుకు తాత్కాలికంగా నిర్ణయించారు.