హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి నీటి చుక్కను పొదుపుగా వాడాలి'

NDL: ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం సందర్భంగా కోవెలకుంట్ల సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో 'సేవ్ వాటర్–సేవ్ లైఫ్' కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ సిస్టర్ గీతా ఆధ్వర్యంలో నీటి ప్రాముఖ్యత, పొదుపుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి. నీటిని వృథా చేయకుండా భవిష్యత్ తరాల కోసం సంరక్షించాలని కోరారు.