హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంను కలిసిన సీపీఐ రామకృష్ణ

GNTR: సీఎం చంద్రబాబును సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావాన్ని విపత్తుగా పరిగణించి, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా పరిహారం వెంటనే చెల్లించాలన్నారు. ప్రత్యామ్నాయ సాగు చేపట్టేవారికి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు.