హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే అభినందనలు

కృష్ణా: DSCలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన బాపులపాడు మండలం శేరినరసన్నపాలేనాకి చెందిన సొదిమెళ్ల సత్యన్నారాయణ, పసగడి రమేష్‌లను MLA యార్లగడ్డ వెంకట్రావు అభినందించారు. శుక్రవారం వారి ఇళ్లకు వెళ్లి దుశ్శాలువాలతో సత్కరించారు. 22 నుంచి 26 ఏళ్లుగా ప్రయత్నించి ఉద్యోగాలు సాధించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయ వృత్తి సమాజానికి దిశానిర్దేశం చేసే బాధ్యతన్నారు.