సత్యసాయి: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని కోవెలకుంటపల్లిలో వినాయక నిమజ్జనం సంప్రదాయ పద్ధతిలో ఘనంగా నిర్వహించారు. ఎలాంటి డీజే లేకుండా డ్రమ్స్ వాయిస్తూ ఎద్దుల బండిపై వినాయకుడి విగ్రహాన్ని ఊరేగించారు. గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగింపు కొనసాగింది. అనంతరం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎద్దుల బండిపై వినాయకుడి ఊరేగింపు


