హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​మంత్రికి ‘పవన్ కళ్యాణ్ అనే నేను’ పుస్తకం అందజేత

GNTR: 'పవన్ కళ్యాణ్ అనే నేను' పుస్తక రచయిత వికాస్ గోర్లే.. రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాను రాసిన పుస్తకాన్ని మంత్రికి బహూకరించారు. పుస్తకాన్ని స్వీకరించిన మనోహర్, రచయిత వికాస్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన భవిష్యత్ కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.