TPT: గరుడసేవను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ నెల 20న అర్ధరాత్రి 1 గంటకు జన్ సాధారణ్ మెమూ స్పెషల్ తిరుపతి నుంచి చెన్నై ఎంఎస్‌బీకి బయలుదేరుతుంది. మరో రైలు రాత్రి 1.15 గంటలకు తిరుపతి నుంచి విజయవాడకు వెళ్తుంది. గరుడసేవ అనంతరం భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
గరుడసేవ తర్వాత ప్రత్యేక రైళ్లు సిద్ధం


