హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథకు పాలమూరు-రంగారెడ్డి నీరు

RR: జిల్లాలోని నార్లాపూర్ రిజర్వాయర్‌ నుంచి మిషన్ భగీరథకు నీటిని తరలించేందుకు రూ.200 కోట్లతో చేపడుతున్న పంపింగ్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులతో కలిసి పరిశీలించారు. నీటి ప్రవాహం తగ్గిన నేపథ్యంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి తాగునీటి సరఫరాకు చర్యలు వేగవంతం చేశారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.