హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయాలు: ఈటల

HYD: బంజారాహిల్స్‌లోని తాజ్ డెక్కన్‌లో నిర్వహించిన ‘పాలిటిక్స్ బియాండ్ క్యాస్ట్’ రౌండ్‌టేబుల్ సమావేశంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. కుల, మత, ప్రాంతీయతలకు అతీతంగా మానవత్వం, రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయాలు కొనసాగాలని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే పాలకుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచిస్తూ, సామాజిక మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.