హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్టీసీ బస్సు ప్రమాదం.. మంత్రి పొన్నం ఆరా

SDPT: కొమురవెల్లి స్టేజి వద్ద సికింద్రాబాద్‌ - సిద్దిపేట మధ్య ప్రయాణిస్తున్న సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ప్రమాదానికి గురైన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరా తీశారు. గాయపడిన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరమైన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.