హైదరాబాద్: 28°C
తెలంగాణ

మతిస్థిమితం లేని వృద్ధురాలిని చేరదీసిన పోలీసులు

SRCL: మతిస్థిమితం లేని వృద్ధురాలిని పోలీసులు చేరదీసి సురక్షితంగా స్వగ్రామానికి పంపించారు. గుండి గ్రామానికి చెందిన కల్వకుంట్ల హేమలత అనే వృద్ధురాలు బోయినపల్లి నుంచి దేశాయిపల్లి వెళ్లే రహదారిపై పడి ఉండటాన్ని ఏఎస్సై గంగరాజం, బ్లూకోట్ సిబ్బంది గమనించారు. ఆమె వివరాలు తెలుసుకుని, గుండి గ్రామ సర్పంచ్‌తో మాట్లాడి, ఆటోలో స్వగ్రామానికి సురక్షితంగా పంపించారు.