హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలిలో గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న డీఎస్పీ

GNTR: తెనాలి ప్రగడ కోటయ్య నగర్ ఐటీఐ కాలేజ్ సెంటర్‌లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో 31వ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం 4 వేల మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ బి. జనార్దనరావు పాల్గొని గణపతికి పూజలు చేసి అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయమన్నారు.